సంచార జాతుల జీవన 'పయనం'
నాటిక: పయనం
సమర్పణ: శార్వాణి గ్రామీణ, గిరిజన సాంస్కృతిక సేవా సంస్థ, బొరివంక
నటీనటులు: చలపతి, శోభన్‌బాబు, సాంబమూర్తి, చలం, సర్వేశ్వరరావు, దుదిష్టి
మేకప్: రమణ
సంగీతం: లీలామోహన్
నేపథ్యగానం: చలం
రచన- దర్శకత్వం: కె.కె.ఎల్.స్వామి
సంచార జాతుల సమగ్ర జీవన చిత్రమే ఈ పయనం(#payanam) నాటిక(#natika). శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంక(#borivanka)కు చెందిన శార్వాణి గ్రామీణ గిరిజన మరియు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా మునకపాక(#munagapaka)లో ఈ నాటిక ప్రదర్శించారు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కళాకారులు తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశారు.
