మద్దిలికి ‘సాహితీ సింహ’ పురస్కారం
![]() |
కేశవరావును సత్కరిస్తున్న కుమార్ నాయక్, తదితరులు |
సాహిత్యం, పాత్రికేయ రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రముఖులు మద్దిలి కేశవరావు ప్రతిష్టాత్మకమైన ‘సాహితీ సింహ’ పురస్కారాన్ని అందుకున్నారు. కాశీబుగ్గ - పలాసకు చెందిన జనజాగృతి సాహితీ సంస్కృతి సమాఖ్య దశమ వార్షికోత్సవం, ఉగాది ఉత్సవాల సందర్భంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు డాక్టర్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. కేశవరావు సమాజానికి అందిస్తున్న సాహితీ సేవలు ఎంతో మార్గదర్శకమని కొనియాడారు. ఆయన రచనలు సామాజిక స్పృహను పెంపొందిస్తూ, పాఠకులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని అందించడం గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కేశవరావును శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రం, స్మారక చిహ్నాన్ని అందజేశారు. కార్యక్రమంలో జనజాగృతి సాహితీ సంస్కృతి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తెప్పల కృష్ణమూర్తి, ప్రముఖ నాటక రచయిత లండ రుద్రమూర్తి, మడ్డు తిరుపతిరావుతో పాటు పలువురు సాహితీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేశవరావుకు అభినందనలు తెలిపారు.

