కార్తీక వన భోజన సందడి
కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ బాలగణపతి ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో తేదీ 22.11.2021న కార్తీక వనభోజనాలతో పాటు రామలింగేశ్వర స్వామి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణతో పాటు అతిథులను ఘనంగా సన్మానించారు. రామలింగేశ్వర నాట్య మండలిచే భజన కాలక్షేపం, బి.కె. లత గారిచే ఆధ్యాత్మిక ప్రసంగం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం మేళతాళలతో బాణసంచా వెలుగులతో అమ్మవార్ల వేషధారణతో స్వామి తిరువీధి అంగరంగ వైభవంగా సాగింది.
