ఫొటోషూట్లకు కేరాఫ్ అడ్రాస్ మాంగమారిపేట
విశాలమైన తీరం.. విశాఖ సొంతం. ప్రకృతి అందాలకు విశాఖ తీర ప్రాంతాలు నెలవు కావడంతో ప్రీ వెడ్డింగ్ షూట్లకు ఇతర రాష్ట్రాల నుంచి కొత్త జంటలు తరలివస్తున్నారు. భీమిలి, రుషికొండ, తొట్లకొండ, మంగమారిపేట బీచ్‌లకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. సూర్యోదయానికి ముందే ఇక్కడకు చేరుకుని.. ప్రకృతి అందాల మధ్య ఫొటోలు దిగి పదిలపరుచుకుంటున్నాయి. ముఖ్యంగా మాంగమారిపేటలోని శిలాతోరణం ఫొటో షూట్లకు కేరాఫ్ అడ్రాస్‌గా మారింది.
