భగవాన్‌దాస్.. బహుముఖ ప్రజ్ఞాశాలి.
భగవాన్‌దాస్(#bhagavandas).. బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆయన భగవాన్ మాస్టర్‌గా సుపరిచితులు.. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ఉద్యోగ విరమణ చేసిన భగవాన్ దాస్‌కు జానపద కళలంటే చాలా మక్కువ. రచయితగా.. కవిగా.. గాయకుడిగా.. సంగీత దర్శకుడిగా.. ఇలా అన్ని రంగాల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. అటు పల్లె పాటలు.. ఇటు ఆధ్మాతిక గీతాలు.. అభ్యుదయ కవితలు.. ఇలా.. తనలోని భావాలకు అక్షర రూపం ఇస్తున్నారు. అన్ని రకాల సంగీత పరికరాలు వాయించగల సత్తా ఆయనది. ఉదయం, సాయంత్రం అమ్మవారి ఆలయాల్లో వినిపించే జాలారి- అమ్మవారి పాట ఆయన కలం.. గళం నుంచి జాలువారిందే.. ఆయన ప్రతిభకు దక్కిన ప్రశంసలు కొకొల్లలు.. అవార్డులైతే లెక్కలేనన్ని.. శ్రీకాకుళం(#srikakulam) జిల్లా కంచిలి(#kanchili)కి చెందిన ఆయన వైజాగ్(#visakapatnam) లో నివాసం వుంటున్నారు. భగవాన్ దాస్ మాస్టర్‌పై ఉద్దానం స్టార్స్‌లో స్పెషల్ స్టోరీ.
Bhagavan master contact number: 91825 20037
