ప్రాచీన బౌద్ధ క్షేత్రం.. తొట్లకొండ
విశాఖ నగరంలో అందమైన బీచ్లే కాదు.. అద్భుత పర్యాటక ప్రాంతాలు, చారిత్రాత్మక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇందులోని తొట్లకొండ బౌద్ధారామ క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది. సముద్రతీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తైన కొండపై ఈ ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఉంది. రాతిని తొలిచి నిర్మించిన అనేక నీటి తొట్టెలు ఈ కొండపై ఉండటం వల్ల దీనికి తొట్లకొండ అనే పేరొచ్చింది. క్రీస్తుపూర్వం 200 నుంచి 300 శతాబ్దం మధ్య ఈ ప్రదేశం ఓ వెలుగు వెలిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో భీమిలి రోడ్డు మార్గంలో తొట్లకొండ బౌద్ధారామం ఉంటుంది.
