- ముగిసిన బొరివంక నాటికల సందడి
- కళింగసీమ కళాపీఠం నాటిక పోటీల విజేతలు వీరే..
- ఉత్తమ నటుడిగా భాను ప్రకాష్, నటిగా కుసుమ కుమారి

(జ్ఞాపిక, నగదు బహుమతి స్వీకరిస్తున్న అమ్మ చెక్కిన బొమ్మ బృందం)
బొరివంక(కవిటి): శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బొరివంక గ్రామంలో గత మూడు రోజులుగా కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానిత నాటిక పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. సామాజిక సందేశం, హాస్యం, భావోద్వేగాలతో సాగిన ఈ పోటీలలో ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పోటీల ముగింపు అనంతరం న్యాయనిర్ణేతలు విజేతల వివరాలను ప్రకటించారు.
ప్రధాన బహుమతులు
- హైదరాబాద్‌కు చెందిన గోవాడ క్రియేషన్స్ వారు ప్రదర్శించిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక తన వైవిధ్యమైన కథాంశంతో ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.
- ద్వితీయ బహుమతి: గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన సహాన నాటికకు లభించింది.
- తృతీయ బహుమతి (జ్యూరీ): కరీంనగర్‌కు చెందిన చైతన్య కళాభారతి వారి స్వప్నం రాల్చిన అమృతం నాటిక దక్కించుకుంది.
వ్యక్తిగత బహుమతులివే..
- నటీనటులు తమ అద్భుత అభినయంతో ప్రేక్షకులను మెప్పించి పలు వ్యక్తిగత బహుమతులను గెలుచుకున్నారు:
- ఉత్తమ నటుడు: భాను ప్రకాష్ (నాటిక: అమ్మ చెక్కిన బొమ్మ - శశి పాత్ర)
- ఉత్తమ నటి: జి.ఎన్.డి. కుసుమ కుమారి (నాటిక: సహాన - సహాన పాత్ర)
- ఉత్తమ దర్శకుడు: ఎన్. రవీంద్రరెడ్డి (నాటిక: సహాన)
- ఉత్తమ రచన: జ్యోతిరాజ్ భీశెట్టి (నాటిక: అమ్మ చెక్కిన బొమ్మ)
- ఉత్తమ విలన్: అద్దేపల్లి లక్ష్మణ్ (నాటిక: సహాన - గుణవర్ధన్ పాత్ర)
- ఉత్తమ క్యారెక్టర్ నటుడు: కె.సత్యనారాయణ (నాటిక: చిటికెన వేలు)
- ఉత్తమ సంగీతం: లీలా మోహన్ (నాటిక: సహాన)
- ఉత్తమ హాస్యనటుడు: పి.కోటేశ్వరరావు (నాటిక: మా ఇంట్లో మహాభారతం - వాసుదేవరావు పాత్ర)
- ద్వితీయ ఉత్తమ నటుడు: శేఖర్ భీశెట్టి (నాటిక: నీళ్లు - నీళ్లు)
- ద్వితీయ ఉత్తమ నటి: గుడివాడ లహరి (నాటిక: స్వప్నం రాల్చిన అమృతం)
- ఉత్తమ క్యారెక్టర్ నటి: జ్యోతిరాణి (నాటిక: స్వప్నం రాల్చిన అమృతం)
- సాంకేతిక,ప్రత్యేక బహుమతులు:
- ఉత్తమ ఆహార్యం: మా ఇంట్లో మహాభారతం (శ్రీ మద్దుకూరి ఆర్ట్ క్రియేషన్స్)
- ఉత్తమ రంగాలంకరణ: రమణ, అప్పారావు (నాటిక: చిటికెన వేలు)
- జ్యూరీ అవార్డులు: హర్షిణి(అమ్మ చెక్కిన బొమ్మ/స్వప్నం రాల్చిన అమృతం), హేమ వెంకటేశం (చిటికెన వేలు).
ఈ ముగింపు కార్యక్రమంలో కళింగసీమ కళాపీఠం అధ్యక్షులు బల్లెడ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. నాటక కళను బతికించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు నిర్వాహకులు, గ్రామ పెద్దలు బహుమతులను అందజేసి అభినందించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన కళాకారులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
