- నేటి నుంచి కళింగ సీమ కళాపీఠం నాటక పరిషత్
- ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల రాక
- మూడు రోజుల పాటు పండగ వాతావరణం
శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం, బొరివంక గ్రామం మరోసారి సాంస్కృతిక వేదికగా మారుతోంది. కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానిత నాటక పోటీలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. బొరివంకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని బెందాళం వెంకటేశ్వరశర్మ స్మారక కళావేదికపై ఈ ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
మూడు రోజుల నాటక షెడ్యూల్
తేదీ నాటకం పేరు నాటక సంస్థ / ఊరు రచన & దర్శకత్వం
03.04.2026 చిటికెన వేలు తెలుగు కళా సమితి అట్టాడ అప్పలనాయుడు (రచన),
విశాఖపట్నం చలసాని ప్రసాద్ (దర్శకత్వం)
నీళ్లు - నీళ్లు శ్రీ నటరాజ్ అసోసియేషన్ చందు తులసి (మూలకథ),
పెందుర్తి రావి నాగేశ్వరరావు (రచన),
శేఖర్ భీశెట్టి (దర్శకత్వం)
04.04.2026 సహోన అభినయ ఆర్ట్స్ - గుంటూరు స్నిగ్ధ (రచన), ఎన్. రవీంద్రరెడ్డి (దర్శకత్వం)
మా ఇంట్లో శ్రీ మద్దుకూరి ఆర్ట్ క్రియేషన్స్ మద్దుకూరి రవీంద్రబాబు (రచన, దర్శకత్వం)
మహాభారతం చిలకలూరిపేట
ఆలీతో సరదాగా ది అమెచ్యూర్ అద్దేపల్లి భరత్ కుమార్ (రచన), అసోసియేషన్ చిలకలూరిపేట ఎస్.కె.షఫీ(దర్శకత్వం)
05.04.2026 అమ్మ చెక్కిన బొమ్మ గోవాడ ఆర్ట్ థియేటర్స్ జ్యోతిరాజ్ భీశెట్టి (రచన)
హైదరాబాద్ డా॥ వెంకట్ (దర్శకత్వం)
స్వప్నం రాల్చిన అమృతం చైతన్య కళాభారతి శ్రీపరమాత్ముని శివరాం (రచన),
కరీంనగర్ మంచాల రమేష్ (దర్శకత్వం)
ఇది అతని సంతకం అభినయ ఆర్ట్స్ - గుంటూరు స్నిగ్ధ (రచన), ఎన్. రవీంద్రరెడ్డి (దర్శకత్వం)
కళాభిమానులకు ఆహ్వానం
తెలుగు నాటక రంగానికి ప్రాణం పోస్తున్న ఉత్తమ నాటక సంస్థలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. సామాజిక ఇతివృత్తాలతో, సందేశాత్మక కథాంశాలతో సాగే ఈ ప్రదర్శనలను తిలకించేందుకు కళాభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

